Indiaలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు

ABN , First Publish Date - 2022-01-13T15:38:39+05:30 IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.

Indiaలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,47,417 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.  84,825 మంది కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌తో 380 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 4,85,035గా ఉంది. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 11,17,531గా ఉంది. అలాగే రోజువారీ పాజిటివీటి రేటు 13.11 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు దేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 5,448కి చేరింది. 


Updated Date - 2022-01-13T15:38:39+05:30 IST