Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రపంచ అప్పు: 226 లక్షల కోట్ల డాలర్లు!

భారత రుణభారం జీడీపీలో 90.6 శాతం


వాషింగ్టన్‌, అక్టోబరు 13: కొవిడ్‌.. ప్రపంచాన్ని అప్పు ల్లో ముంచేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) తాజా నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కరోనా వల్ల కుదేలవుతున్న ఆర్థిక పరిస్థితులను కుదుటపరిచేందుకు వివిధ దేశాలు ప్రవేశపెట్టిన పాలసీలు, ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీల వల్ల రికార్డు స్థాయిలో అప్పులు పేరుకుపోయాయని పేర్కొంది. ప్రపంచ దేశాలు ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు రుణాలతో కలిపి 226 లక్షల కోట్ల డాలర్లు అప్పు చేశాయని, ఇందులో 90ు వాటా చైనా సహా ఇతర బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలదేనని తెలిపింది. 2020తో పోల్చితే 27 లక్షల కోట్ల డాలర్లు ఎక్కువ. ఇక మన దేశం విషయానికి వస్తే 2016లో మొత్తం జీడీపీలో 68.6 శాతంగా ఉన్న అప్పు 2020 నాటికి 89.6 శాతానికి చేరుకుంది. 2021లో ఇది గరిష్ఠ స్థాయిని నమోదు చేసి 90.6 శాతానికి చేరుకుంది. ఇది 2022కి 88.8 శాతానికి తగ్గి 2026 నాటికి 85.2 శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement