Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాన్పూరు టెస్టు: 234 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్

కాన్పూరు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్ 283 పరుగుల ఆధిక్యం లభించింది.  ఓవర్ నైట్ స్కోరు 14/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడినట్టు కనిపించింది.


అయితే, శ్రేయాస్ అయ్యర్ (65), అశ్విన్ (32)లు బాధ్యతాయుతంగా ఆడి వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. చివరల్లో వృద్ధిమాన్ సహా అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 126 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో అజేయంగా 61 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (28 నాటౌట్) అతడికి సహకారాన్ని అందించాడు.


దీంతో జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఏడు వికెట్ల నష్టానికి 234 చేసింది. అప్పటికి టీమిండియా ఆధిక్యం 283 పరుగులకు చేరుకోవడంతో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. పర్యాటక జట్టులో సౌథీ, జెమీసన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అజాజ్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు. 

Advertisement
Advertisement