శ్రీలంకతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం!

ABN , First Publish Date - 2021-04-11T03:06:41+05:30 IST

కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని ప్రకటించింది. సమీప భవిష్యత్తులో అర్హులైన ప్రయాణికులందరూ భారత్-శ్రీలంక మధ్య విమానాల్లో ప్రయాణించ్చొచ్చని వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భార

శ్రీలంకతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని ప్రకటించింది. సమీప భవిష్యత్తులో అర్హులైన ప్రయాణికులందరూ భారత్-శ్రీలంక మధ్య విమానాల్లో ప్రయాణించ్చొచ్చని వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్-శ్రీలంక దేశాల మధ్య ఎయిర్ బబుల్ ఒప్పందం కుదురిందని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నట్టు పేర్కొంది. అర్హులైన ప్రయాణికులందరూ ఇరు దేశాల మధ్య ప్రయాణించేందుకు మార్గం సుగమం అయినట్టు అభిప్రాయపడింది. కొవిడ్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమాన సర్వీసలను పునరుద్దరించడంలో భాగంగా భారత ప్రభుత్వం పలు దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇప్పటి వరకు 27దేశాలతో భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తాజాగా ఈ జాబితాలో శ్రీలంక చేరింది. 

Updated Date - 2021-04-11T03:06:41+05:30 IST