ప్రాక్టీస్‌కు మూడు రోజులే..

ABN , First Publish Date - 2021-01-27T06:40:01+05:30 IST

తొలి టెస్టు కోసం సిద్ధమయ్యేందుకు భారత్‌-ఇంగ్లండ్‌ జట్లకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండనుంది. ప్రస్తుతం శ్రీలం కలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు బుధవారం ఉదయం చెన్నై రానుంది...

ప్రాక్టీస్‌కు మూడు రోజులే..

  • నేడు ఇంగ్లండ్‌ క్రికెటర్ల రాక


చెన్నై: తొలి టెస్టు కోసం సిద్ధమయ్యేందుకు భారత్‌-ఇంగ్లండ్‌ జట్లకు కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండనుంది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు బుధవారం ఉదయం చెన్నై రానుంది. స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, రహానె, హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ మంగళవారమే చెన్నైకి చేరుకోగా.. కెప్టెన్‌ కోహ్లీ సహా మిగతా ఆటగా ళ్లంతా బుధవారం నుంచి విడతల వారీగా రానున్నారు.  ఆ తర్వాత నిబంధనల ప్రకారం అందరూ ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. వచ్చేనెల 5 నుంచి స్థానిక చెపాక్‌ మైదానంలో తొలి టెస్టు జరగనుంది. దీంతో అప్పటికి మూడు రోజులపాటే ప్రాక్టీ్‌సకు సమయం ఉండనుంది. మరోవైపు బయో సెక్యూర్‌ రక్షణ కోసం ఆటగాళ్లకు ప్రత్యేకంగా హోటల్‌ను బుక్‌ చేశారు. సిరీస్‌ జరిగే సమయంలో వీరు తమ కుటుంబ సభ్యులతో ఉండొచ్చు కానీ.. స్టేడియం, హోటల్‌కు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. ప్లేయర్స్‌ బబుల్‌ను కట్టుదిట్టం చేసేందుకు తమిళనాడు క్రికెట్‌ సంఘం మూడు జోన్లుగా విభజించింది. ఇక మ్యాచ్‌లకు 50శాతం ప్రేక్షకులను కేంద్రం అనుమతించినా బీసీసీఐ మాత్రం తొలి రెండు టెస్టులను ఖాళీ స్టేడియాల్లోనే జరపాలనుకుంటోంది.


Updated Date - 2021-01-27T06:40:01+05:30 IST