ఇంటర్నెట్‌ వినియోగంలో టాప్‌-2

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

మన దేశంలో 1995 ఆగస్టు 15న విదేశీ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (విఎస్‌ఎన్‌ఎల్‌) మొదటిసారిగా ఇంటర్నెట్‌ను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది...

ఇంటర్నెట్‌ వినియోగంలో టాప్‌-2

మన దేశంలో 1995 ఆగస్టు 15న విదేశీ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (విఎస్‌ఎన్‌ఎల్‌) మొదటిసారిగా ఇంటర్నెట్‌ను ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు భారత్‌ ఇంటర్నెట్‌ వినియోగంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. 


  1. ప్రస్తుతం మన దేశంలో నెట్‌ వినియోగదారుల సంఖ్య 73 కోట్లు. 
  2. కొత్తగా ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న వారిలో 75 శాతం గ్రామీణులే.
  3. మొదటిసారి నెట్‌ వాడుతున్న వారిలో స్థానిక భాషల్లో కంటెంట్‌ కోసం వెతుకున్న వారి సంఖ్య 75 శాతంగా ఉంది.
  4. రాబోయే ఐదేళ్లలో మొబైల్‌లో వీడియో కంటెంట్‌ చూసే వారి సంఖ్య 83 శాతం పెరిగే అవకాశం ఉంది.
  5. ఈ-కామర్స్‌ లావాదేవీలు మొబైల్‌ ఫోన్లలోనే 70 శాతం జరుగుతున్నాయి.
  6. 50 శాతం ట్రావెల్‌ లావాదేవీలు ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు.

Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST