కొవిడ్ టీకాలున్నా...వేయించుకునేందుకు ముందుకు రాని వైనం

ABN , First Publish Date - 2021-01-27T17:23:48+05:30 IST

ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజలకు కొవిడ్ టీకాలు వేయడానికి తగినన్ని వ్యాక్సిన్లు లేక అవస్థలు పడుతుంటే, భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది.....

కొవిడ్ టీకాలున్నా...వేయించుకునేందుకు ముందుకు రాని వైనం

భారత్‌లో వింత పరిస్థితి

న్యూఢిల్లీ : ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రజలకు కొవిడ్ టీకాలు వేయడానికి తగినన్ని వ్యాక్సిన్లు లేక అవస్థలు పడుతుంటే, భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. భారతదేశంలో కొవిడ్ వ్యాక్సిన్లు పుష్కలంగా ఉన్నా వాటిని తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల ఉత్పత్తి భారతదేశంలో జరుగుతోంది. పూణే, హైదరాబాద్ నగరాల్లో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి సాగుతోంది. ప్రభుత్వం వ్యాక్సిన్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నా కొందరు మాత్రం వేయించుకునేందుకు అనాసక్తి చూపిస్తున్నారు. 


భారతదేశం నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు యూకే, బెల్జియం, సౌదీఅరేబియా దేశాలు యత్నిస్తున్నాయి. పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్, హైదరాబాద్ నగరంలోని భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ లున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్లు సిద్ధంగా ఉన్నా ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాల్సిన అవసరముందని వైద్యులు చెపుతున్నారు.  

Updated Date - 2021-01-27T17:23:48+05:30 IST