60 మెడల్స్ దాటేసిన చైనా, అమెరికా..29 గోల్డ్స్‌తో టాప్‌లో..

ABN , First Publish Date - 2021-08-03T10:42:06+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో చైనా, అమెరికా ఇరు దేశాలూ 60 మెడల్స్‌‌కు పైగా సాధించి మెడల్స్ పట్టికలో టాప్ 1, 2 ప్లేస్‌ల్లో...

60 మెడల్స్ దాటేసిన చైనా, అమెరికా..29 గోల్డ్స్‌తో టాప్‌లో..

టోక్యో ఒలింపిక్స్‌లో చైనా, అమెరికా ఇరు దేశాలూ 60 మెడల్స్‌‌కు పైగా సాధించి మెడల్స్ పట్టికలో టాప్ 1, 2 ప్లేస్‌ల్లో కొనసాగుతున్నాయి. టాప్‌లో 69 మెడల్స్‌తో చైనా ఉండగా.. అందులో 29 గోల్డ్ మెడల్స్, 17 సిల్వర్, 16 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. ఇక అమెరికా 22 గోల్డ్స్, 25 సిల్వర్స్, 17 బ్రాంజ్‌ మెడల్స్‌తో కలిసి 64 మెడల్స్ సాధించింది. మూడో స్థానంలో 17 బంగారు, 6 రజత, 10 కాంస్య పతకాలతో మొత్తం 33 పతకాలు గెలిచి జపాన్ నిలించింది.


కాగా.. మెడల్స్ పట్టికలో ఒక రజతం, ఒక కాంస్యం సాధించిన భారత్ 62వ స్థానంలో కొనసాగుతోంది. భారత్‌తో పాటు కెన్యా, పోర్చుగల, శాన్ మరినో, ఉగాండా కూడా ఓ రజతం, ఓ కాంస్యం సాధించి 62వ స్థానంలో ఉన్నాయి. ఆగస్టు 8తో ఒలింపిక్ పోటీలు ముగియనున్నాయి.

Updated Date - 2021-08-03T10:42:06+05:30 IST