Abn logo
Sep 27 2021 @ 23:23PM

భారత్‌ బంద్‌ ప్రశాంతం

రాయచోటిలో ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు

రాయచోటి, సెప్టెంబరు27:  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం జరిగిన భారత్‌బంద్‌లో భాగంగా రాయచోటిలో జరిగిన బంద్‌ నిర్వహించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర నాయకుడు ఈశ్వర్‌, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివావాసులు, సీపీయం కార్యదర్శి రామాంజులు, అయ్యప్ప సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రంగారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి అల్లాబకష్‌ (సీఎల్పీ), మహమ్మద్‌గౌస్‌, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ వేణుగోపాల్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మహమ్మద్‌రఫీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, పౌరహక్కుల సంఘం నాయకుడు రెడ్డెయ్య, పట్టణ అధ్యక్షుడు ఖాదర్‌వలి, రాజంపేట పార్లమెంటరీ జిల్లా కార్యనిర్వాహక మైనార్టీ కార్యదర్శి వతన్‌నిస్సార్‌, జనసేన పార్టీ నాయకుడు రియాజ్‌, ముస్లిం లీగ్‌ పార్టీ నాయకుడు బాషా, మైనార్టీ హక్కుల పరిరక్షణ సంస్థ నాయకుడు సగీర్‌ తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి దుకాణాలు మూయించారు.  నేతాజీ సర్కిల్‌ వద్ద మానవహారం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.