Abn logo
Sep 27 2021 @ 22:48PM

జిల్లాలో భారత్‌ బంద్‌ పాక్షికం.. ప్రశాంతం..

రెబ్బెనలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు

- అఖిలపక్షం నాయకుల రాస్తారోకో

- రెబ్బెనలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం

- అరెస్టు చేసిన పోలీసులు 

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 27: ఆసిఫాబాద్‌ పట్టణంలో బంద్‌ సోమవారం పాక్షికంగా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కాక ఇతరపార్టీలు బంద్‌ కు పిలుపునిచ్చాయి. అఖిలపక్షం నాయకులు పట్టణం లో ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ధర్నా చేపట్టారు. దీంతోకొద్దిసేపు బస్సుల రాకపోకలు నిలి చాయి. ఆందోళన చేస్తున్న అఖిలపక్షం నాయకులను అడ్డుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. వ్యాపార, వాణిజ్యసముదాయాలు మధ్యాహ్నం 12గంటల వరకు తెరుచుకోలేదు. అలాగే విద్యుత్‌ కార్మికచట్టాలను నిర సిస్తూ విద్యుత్‌శాఖసిబ్బంది ఎన్‌పీడీసీఎల్‌ కార్యా లయంఎదుట నిరసనవ్యక్తం చేశారు. డీసీసీ అధ్య క్షుడు విశ్వప్రసాద్‌రావు, చరణ్‌, బద్రిసత్య నారాయణ, చిరంజీవి, లోకేష్‌, ఆత్మారావు, సాయిరాం పాల్గొన్నారు. 

రెబ్బెన: మండలంలో భారత్‌బంద్‌ పాక్షికంగా జరి గింది. అఖిలపక్షం నాయకులు ప్రధానిమోదీ దిష్టి బొమ్మను దహనంచేశారు. కార్యక్ర మంలో ఉపేందర్‌, పోశం, తిరుపతి, నర్సయ్య, రమేష్‌, శ్యాం, దేవాజీ, తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఓపెన్‌ కాస్టులలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు.  కార్యక్రమంలో శ్రీను, జగ్గయ్య, శేషు, శివరావు, ఆనంద్‌, సారయ్య, కిరణ్‌బాబు పాల్గొన్నారు. 

లింగాపూర్‌: మండలకేంద్రంలో బంద్‌ సందర్భం గా అఖిలపక్షం నాయకులు ర్యాలీ నిర్వహించారు. నాయకులు అజమోద్దీన్‌, శంశోద్దీన్‌, శివాజీ, పాండు, బాబా, నర్బాజ్‌, హనీఫ్‌, ముస, మౌలా పాల్గొన్నారు. 

తిర్యాణి:మండలకేంద్రంలో అఖి లపక్ష నాయకులు మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయ కులు లచ్చగౌడ్‌, వెంకటేశం, శంకర్‌, విజయ్‌, అశోక్‌, మొగిలి, వెకంటేశంపాల్గొన్నారు. 

బెజ్జూరు: మండలకేంద్రంలో అఖిలపక్షం నాయ కులు తిరుగుతూ దుకాణాలను మూసి వేయించారు. శ్రీవర్ధన్‌, శైలేష్‌, సల్మాన్‌ఖాన్‌, మల్లేష్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

కెరమెరి: మండలకేంద్రంలో అఖిలపక్షం నాయ కుల ఆధ్వర్యంలో బంద్‌ విజయవంతమైంది. కార్యక్ర మంలో బాబురావు,సుదర్శణ్‌,ఆనంద్‌రావు పాల్గొన్నారు.

వాంకిడి: మండలంలో బంద్‌ సంపూర్ణం అయింది. ఉదయం కాంగ్రెస్‌ నాయకులు బంద్‌ కార్యక్రమంలో పాల్గొని వ్యాపారసంస్థలను మూయించారు. మధ్యా హ్నం వరకు సంపూర్ణ బంద్‌ పాటించగా తరువాత వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. బంద్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు గుర్నులే నారాయణ పాల్గొన్నారు.

సిర్పూర్‌(యూ): బంద్‌ మండలంలో పాక్షికంగా జరిగింది. బంద్‌కు పలురాజకీయ పార్టీలు, సంఘాలు పూర్తి మద్దతు ఇచ్చాయి. మండలంలో బంద్‌ మధ్యాహ్నం వరకు నిర్వహించారు.