యోగాకు పుట్టినిల్లు భారతదేశం

ABN , First Publish Date - 2021-06-22T05:59:22+05:30 IST

భారత దేశం యోగా విద్యకు పుట్టినిల్లు అని బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు సుహాసినిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగా సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

యోగాకు పుట్టినిల్లు భారతదేశం

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 21: భారత దేశం యోగా విద్యకు పుట్టినిల్లు అని బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు సుహాసినిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పతాంజలి యోగా సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. యోగా విద్యను అంతర్జాతీయ గుర్తి ంపు తీసుకొచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకి దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా యోగా భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా తలమడుగు మండలంలోని అర్లి(కె) గ్రామానికి చెందిన బొండ్ల భార్గవ్‌ అనే విద్యార్థి పలు ఆసనాలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు.

ఉట్నూర్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని స్థానికంగా యోగా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానికంగా నిర్వహించిన యోగా దినోత్సవంలో మాజీ ఎంపీ రాథోడ్‌ రమేష్‌ పాల్గొని యోగా చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంనాయక్‌, కోండేరి రమేష్‌, కొలిపాక రాజశేఖర్‌, పెందూర్‌ దత్తు, రామగిరి శ్రీను, బోడిగామ రాములు, అక్షయ్‌, మల్లేష్‌, దేవిదాస్‌లు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా స్థానిక పాత బస్టాండ్‌లో పంచాయతీ కార్యాలయం ముందు ఎంపీడీవో తిరుమల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.

ఇంద్రవెల్లి: ప్రపంచానికి భారత్‌ అందించిన అద్భుతాల్లో యోగా ఒకటని, మనిషి మాసిక శారీరక, ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా ఎంతోగానో దోహదం చేస్తుందని అఖిల భారతీయ వనవాసి కళ్యాణ పరిషత్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రిటైర్డ్‌ లేబర్‌ కమిషనర్‌ హెచ్‌కే నాగు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ అర్క పుష్పలత, సర్పంచ్‌ గాంధారీ, హరికృష్ణ మరప రాజు, రాజలింగు, ప్రకాష్‌ పాల్గొన్నారు. 

నేరడిగొండ: మండలంలోని వాంకిడి గ్రామంలో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు, సర్పంచ్‌ ఆడిగెం రాజు, పంచా యతీ కార్యదర్శి పవన్‌కుమార్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ స్థులచే యోగా చేయించారు. యోగా చేయడం వలన జరిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో వసంత్‌రావ్‌ గ్రామస్థులు పాల్గొన్నారు.

బోథ్‌: ప్రతి మనిషికీ యోగా అవసరమని, యోగాతో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని యోగా శిక్షకులు రవీంద్రబాపు పతాంజలి యో గా మండల ఆర్యదర్శి కె.పోశెట్టి పేర్కొన్నారు. బోథ్‌లోని ప్రగతి పాఠశాలలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బోథ్‌లోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఎంపీఈవో జీవన్‌రెడ్డి, సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌లు యోగా శిక్షణ ఇచ్చి యోగా ప్రాముఖ్యతను వివరించారు.

మావల: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అందరు ప్రతి రోజూ తమ దిన చర్యల్లో భాగంగా యోగా చేయడం అలవర్చుకోవాలని డీఆర్డీఏ పీడీ కిషన్‌ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ దొగ్గలి ప్రమీల, మండల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:59:22+05:30 IST