Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాన్పూరు టెస్టు: 250 పరుగులు దాటిన భారత్ ఆధిక్యం

కాన్పూరు: న్యూజిలాండ్‌తో ఇక్కడి గ్రీన్‌పార్క్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యం 250 పరుగులు దాటింది. ఓవర్ నైట్ స్కోరు 14/1తో నాలుగు రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడినట్టు కనిపించింది.


ఈ దశలో, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శ్రేయాస్ అయ్యర్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 125 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 65 పరుగులు చేసి అవుటయ్యాడు. రవీంద్ర జడేజా డకౌట్ కాగా, రవిచంద్రన్ అశ్విన్ సమయోచితంగా ఆడుతూ వికెట్లు పడకుండా కాసేపు అడ్డుకున్నాడు.


చివరికి 32 పరుగులు చేసిన అశ్విన్ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. వృద్ధిమాన్ సాహా 46, అక్షర్ పటేల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.  

Advertisement
Advertisement