Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రపంచ అథ్లెటిక్స్ స్ప్రింటర్ అంజు బాబీ జార్జ్‌కు Woman of Year Award

న్యూఢిల్లీ : ప్రపంచ అథ్లెటిక్స్ స్ప్రింటర్ అంజు బాబీ జార్జ్‌కు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. భారతదేశంలో క్రీడలను అభివృద్ధి చేయడంలో అంజూ కృషి చేసింది. అంజూ అడుగుజాడల్లో మరింత మంది మహిళలు అనుసరించేలా ప్రేరేపించడం వల్ల ఈ సంవత్సరం ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది.2003 వసంవత్సరంలో లాంగ్ జంప్ లో కాంస్యంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని గెలుచుకున్న ఏకైక భారతీయురాలు అంజు. ప్రపంచ బాడీ వార్షిక అవార్డ్స్ నైట్‌లో అంజూ అవార్డుకు ఎంపికైంది.2016లో అంజూ యువతుల కోసం శిక్షణా అకాడమీని ప్రారంభించింది.

 ఈ అకాడమీ ఇప్పటికే ప్రపంచ పతక విజేతలను తయారు చేయడంలో సహాయపడిందని వరల్డ్ అథ్లెటిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా అంజు బాబీ జార్జ్ పాఠశాల విద్యార్థినులకు సలహాదారిణిగా ఉన్నారు.ప్రపంచ అథ్లెటిక్స్ ద్వారా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందడం గౌరవంగా ఉందని అంజు చెప్పారు.


Advertisement
Advertisement