South Africa vs India: సెకండ్ సెషన్‌లోనూ సఫారీలదే పైచేయి

ABN , First Publish Date - 2022-01-12T00:23:34+05:30 IST

భారత్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు భారత తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది

South Africa vs India: సెకండ్ సెషన్‌లోనూ సఫారీలదే పైచేయి

కేప్‌టౌన్: భారత్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు భారత తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి సెషన్‌లో రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను ఆత్మరక్షణలోకి నెట్టేసిన సఫారీ బౌలర్లు రెండో సెషన్‌లో మరో రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా టీ బ్రేక్ సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.


క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన చతేశ్వర్ పుజారా (43) లంచ్ తర్వాత మార్కో జాన్సెన్ బౌలింగులో పెవిలియన్ చేరగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానే మరోమారు పేలవంగా ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. 9 పరుగులు చేసి రబడ బౌలింగులో అవుటయ్యాడు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ 40, రిషభ్ పంత్ 12 క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-01-12T00:23:34+05:30 IST