టీమిండియా టాపార్డర్ ఢమాల్.. 58 పరుగులకే సగం వికెట్లు డౌన్

ABN , First Publish Date - 2021-08-26T00:25:41+05:30 IST

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టును కష్టాలు పూర్తిగా చుట్టుముట్టేశాయి. 58 పరుగులకే

టీమిండియా టాపార్డర్ ఢమాల్.. 58 పరుగులకే సగం వికెట్లు డౌన్

లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టును కష్టాలు పూర్తిగా చుట్టుముట్టేశాయి. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా విలవిల్లాడుతోంది. జేమ్స్ అండర్సన్, రాబిన్సన్‌లు వరుసపెట్టి వికెట్లు తీస్తూ భారత బ్యాట్స్‌మన్‌ను ఒత్తిడిలోకి నెట్టేశారు. తొలి మూడు వికెట్లు.. కేఎల్ రాహుల్ (0), చతేశ్వర్ పుజారా (1), విరాట్ కోహ్లీ (7)ని అండర్సన్ అవుట్ చేయగా, రహానే (18), పంత్ (2)ను రాబిన్సన్ పెవిలియన్ పంపాడు. బులెట్లలా వస్తున్న వీరి బంతులకు బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తుతూ వికెట్లు సమర్పించుకుంటున్నారు.


మరోవైపు ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ సహజ సిద్ధమైన ఆటకు విరుద్ధంగా నెమ్మదిగా ఆడుతూ వికెట్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. 100 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క ఫోర్ ఉంది. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వీరిద్దరిలో ఏ ఒక్కరు అవుటైనా ఇండియా ఇన్నింగ్స్ ముగిసినట్టే. ప్రస్తుతం భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది.

Updated Date - 2021-08-26T00:25:41+05:30 IST