అర్ధ సెంచరీ చేసి అవుటైన రాహుల్.. కొనసాగుతున్న వికెట్ల పతనం

ABN , First Publish Date - 2022-01-04T00:04:44+05:30 IST

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుబిగిస్తోంది. 49 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ను

అర్ధ సెంచరీ చేసి అవుటైన రాహుల్.. కొనసాగుతున్న వికెట్ల పతనం

జొహన్నెస్‌బర్గ్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుబిగిస్తోంది. 49 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టేసిన సఫారీ బౌలర్లు లంచ్ తర్వాత మరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఫలితంగా టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. కీలక ఆటగాళ్లందరూ పెవిలియన్ చేరారు. ప్రస్తుతం వికెట్ కీపర్ రిషభ్ పంత్ (13), రవిచంద్రన్ అశ్విన్ (24) పరుగులతో క్రీజులో ఉన్నారు. 


గాయం కారణంగా కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో  కేఎల్ రాహుల్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగుకు దిగిన భారత్‌‌కు 36 పరుగుల వద్ద తొలి దెబ్బ తగిలింది. 26 పరుగులు చేసిన అగర్వాల్.. మార్కో జాన్సన్ బౌలింగులో అవుటై పెవిలియన్‌కు చేరాడు.


ఆ తర్వాత 49 పరుగుల వద్ద వెంటవెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది. చతేశ్వర్ పుజారా (3), అజింక్య రహానే (0) తీవ్రంగా నిరాశ పరిచారు. హనుమ విహారి క్రీజులో కుదురుకున్నట్టు కనిపించినా భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యాడు.


రబడ బౌలింగులో డుసెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే, వికెట్లు పడుతున్నా క్రీజులో కుదురుకున్న కేఎల్ రాహుల్ నిదానంగా ఆడుతూ టెస్టుల్లో 13వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  ఆ వెంటనే మార్కో జాన్సన్‌ బౌలింగులో రబడకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

Updated Date - 2022-01-04T00:04:44+05:30 IST