బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్.. నాకౌట్ దశపై భారత్ ఆశ

ABN , First Publish Date - 2022-02-18T01:47:50+05:30 IST

మలేసియాలోని షా ఆలమ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్‌లో..

బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్.. నాకౌట్ దశపై భారత్ ఆశ

న్యూఢిల్లీ: మలేసియాలోని షా ఆలమ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆటగాళ్లు నాకౌట్ దశపై ఆశలు పెట్టుకున్నారు. గ్రూప్‌ ఎ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు హాంకాంగ్‌ను 3-2తో ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించాలన్న ఆశలను సజీవంగా ఉంచుకుంది. భారత ఆటగాడు లక్ష్య సేన్.. లీ చెయుక్ యియుపై వరుస గేముల్లో విజయం సాధించాడు.


కొరియాతో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌‌లో భారత్ 0-5తో ఘోర పరాభవాన్ని ఎదుర్కోవడం భారత్ ఆశలను క్లిష్టతరం చేసింది. ఒక విజయం, ఒక ఓటమితో భారత జట్టు ప్రస్తుతం గ్రూప్ ఎలో మూడో స్థానంలో ఉంది. గ్రూప్ ఎలో అర్హత సాధించే రేసులో మూడుసార్లు డిపెండింగ్ చాంపియన్స్ అయిన ఇండోనేషియా, కొరియా ముందున్నాయి.


భారత జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే శుక్రవారం ఇండోనేషియాతో జరిగే మ్యాచ్‌లో ఘన విజయం సాధించడంతోపాటు హాంకాంగ్ చేతిలో కొరియా ఓడిపోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండియా, కొరియా ఒక విజయం, ఒక ఓటమితో సమానంగా ఉన్నాయి. శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఈ రెండూ విజయం సాధిస్తే సమీకరణాలు మారిపోతాయి. మొత్తం మ్యాచ్‌లు, గెలిచి, ఓడిన గేమ్స్ ఆధారంగా నాకౌట్ దశకు అర్హత సాధిస్తారు. ఈ విషయంలో కొరియా భారత్ కంటే ముందంజలో ఉంది. 

Updated Date - 2022-02-18T01:47:50+05:30 IST