భారత్‌ సరఫరా దేశం కావాలి

ABN , First Publish Date - 2021-01-20T08:47:31+05:30 IST

వచ్చే మూడు దశాబ్దాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 9-10 శాతం వృద్ధిని సాధించాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం కాక తప్పదని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ అన్నారు.

భారత్‌ సరఫరా దేశం కావాలి

అమితాబ్‌ కాంత్‌

న్యూఢిల్లీ : వచ్చే మూడు దశాబ్దాల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 9-10 శాతం వృద్ధిని సాధించాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం కాక తప్పదని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ అన్నారు. మంగళవారం ఇక్కడ 15వ భారత డిజిటల్‌ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ భారత్‌ ప్రధాన ఎగుమతి దేశంగా మారవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అలా మారినప్పుడే భారత్‌ సంపన్నదేశమై ప్రజల సంపద పెంచగలుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం ఆత్మరక్షణ కాదని, భారత్‌ను ప్రపంచ సరఫరాల వ్యవస్థలో అంతర్భాగం చేసే సాధనమని కాంత్‌ చెప్పారు. డిజిటల్‌ వాతావరణం గల దేశాలే కొవిడ్‌ అనంతర కాలంలో వృద్ధిని సాధించగలుగుతాయని ఆయన అన్నారు. భారత డిజిటల్‌ అంతరం నానాటికీ తగ్గుతున్నదంటూ గత కొన్నేళ్లలో యూపీఐ చెల్లింపుల వ్యవస్థ కొన్ని రెట్లు పెరిగిందని కాంత్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-20T08:47:31+05:30 IST