Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత గడ్డపై నాలుగేళ్ల తర్వాత ఇలా..

కాన్పూరు: భారత్-న్యూజిలాండ్ మధ్య గ్రీన్‌పార్క్ మైదానంలో జరిగిన తొలి టెస్టు చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగి చివరికి డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం దాదాపు ఖాయమైంది. టీమిండియా విజయానికి ఒకే ఒక్క వికెట్ అవసరం కాగా, చేతిలో దాదాపు 10 ఓవర్లు ఉన్నాయి.


అయితే, కివీస్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (18), అజాజ్ పటేల్ (2) క్రీజులో పాతుకుపోయి భారత్ ఆశలను అడియాసలు చేశారు. జోరుమీదున్న అశ్విన్, జడేజా వంటి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని డ్రా చేసి ఓటమి పరాభవం నుంచి జట్టును రక్షించారు. 


భారత గడ్డపై ఓ టెస్టు డ్రాగా ముగియడం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి. డిసెంబరు 2017లో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన టెస్టు డ్రా అయింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఓ టెస్టు డ్రాగా ముగిసింది. అంతేకాదు, ఈ డ్రాతో భారత గడ్డపై వరుసగా ఆరు టెస్టుల ఓటములకు కివీస్ ఫుల్‌స్టాప్ పెట్టింది.

Advertisement
Advertisement