టెస్ట్ ఛాంపియన్ షిప్‌ పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి టీమిండియా

ABN , First Publish Date - 2021-03-07T01:40:04+05:30 IST

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌పై అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం సాధించి సిరీస్‌ను సైతం 3-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో..

టెస్ట్ ఛాంపియన్ షిప్‌ పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి టీమిండియా

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌పై అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం సాధించి సిరీస్‌ను సైతం 3-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. దీంతో జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌లో స్థానం సంపాదించింది. ఆ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్‌తో తలపడనుంది. టీమిండియా విజయానికి ముందు న్యూజిల్యాండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. మొత్తం 5 సిరీస్‌లలో 7 మ్యాచ్‌లు గెలిచిన కివీస్.. 4 మ్యాచ్‌లలో ఓడిపోయింది. మొత్తం 420 పాయింట్స్‌తో 70.0 పీసీటీ పర్సెంటేజ్‌తో ముందుగా ఫైనల్ చేరింది. అలాగే టాప్ ప్లేస్‌ను కూడా కైవసం చేసుకుంది. అయితే ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా కివీస్‌ను దాటేసింది. ఏకంగా 520 పాయింట్లతో 72.2 పీటీసీ పర్సెంటేజ్‌తో నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది. ఇక దీనికోసం మొత్తం 6 సిరీస్‌లు ఆడిన భారత జట్టు 12 విజయాలు సాధించింది. 4 మ్యాచ్‌లలో ఓడి, ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.



Updated Date - 2021-03-07T01:40:04+05:30 IST