China: సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద హైఅలర్ట్

ABN , First Publish Date - 2021-10-02T18:13:05+05:30 IST

జమ్మూకశ్మీరులోని లడఖ్ ప్రాంతంలోని చైనా సరిహద్దుల్లో భారత సైన్యం హైఅలర్ట్ ప్రకటించింది...

China: సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద హైఅలర్ట్

లడఖ్(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని లడఖ్ ప్రాంతంలోని చైనా సరిహద్దుల్లో భారత సైన్యం హైఅలర్ట్ ప్రకటించింది. గురువారం తూర్పు లడఖ్ వివాదానికి కారణమైన చైనాపై భారత్ నిప్పులు చెరిగింది. చైనా సైనికులు రెచ్చగొట్టేలా వ్యవహరించి శాంతిని దెబ్బతీసింది.లడఖ్‌లో వాస్తవ నియంత్రణ రేఖ వెంట భద్రతా ఏర్పాట్లు పెంచారు.భారత వాస్తవ నియంత్రణ రేఖకు అవతలి వైపు చైనా గణనీయమైన మౌలిక సదుపాయాలను నిర్మించిందని, అయితే భారత సైన్యం ఎలాంటి పరిస్థితులకైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే చెప్పారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రెండు రోజుల పర్యటనలో భాగంగా తూర్పు లడఖ్‌లో సైన్యం కార్యాచరణ సన్నద్ధతను సమీక్షించారు.


Updated Date - 2021-10-02T18:13:05+05:30 IST