‘ఇండియా ఓపెన్‌’ వాయిదా

ABN , First Publish Date - 2021-04-20T10:50:35+05:30 IST

ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌కు ఆఖరి మూడు టోర్నీల్లో ఒకటైన ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ వాయిదా పడింది. వచ్చేనెల 11 నుంచి 16 వరకు ఇక్కడ జరగాల్సిన ఈ టోర్నీని

‘ఇండియా ఓపెన్‌’ వాయిదా

న్యూఢిల్లీ: ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌కు ఆఖరి మూడు టోర్నీల్లో ఒకటైన ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ వాయిదా పడింది. వచ్చేనెల 11 నుంచి 16 వరకు ఇక్కడ జరగాల్సిన ఈ టోర్నీని కొవిడ్‌ కారణంగా వాయిదా వేసినట్టు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) సోమవారం ప్రకటించింది. ‘సవాలు విసురుతున్న కరోనా వైర్‌సతో ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌ను వాయిదా వేయక తప్పడంలేదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య, ఢిల్లీ ప్రభుత్వం, టోర్నీతో సంబంధం ఉన్న అందరితోనూ చర్చించిన తర్వాత ఆటగాళ్లు, అఽధికారుల శ్రేయస్సు రీత్యా వాయిదా నిర్ణయం తీసుకున్నాం’ అని బాయ్‌ ప్రధాన కార్యదర్శి అజయ్‌ సింఘానియా వివరించారు. కొవిడ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో..ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినా మారిన్‌, ప్రపంచ మాజీ చాంపియన్‌ రచనోక్‌ ఇంటనాన్‌, డెన్మార్క్‌ ద్వయం ఆంటొన్‌సెన్‌, రాస్మస్‌ గెమ్కెలాంటి టాప్‌ షట్లర్లు ఇండియా ఓపెన్‌నుంచి వైదొలుగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. 

Updated Date - 2021-04-20T10:50:35+05:30 IST