భారత ఎట్-రిస్క్ దేశాల జాబితాలో యూకే సహా 11 దేశాలు

ABN , First Publish Date - 2021-12-03T01:52:47+05:30 IST

ప్రమాదకర ఒమైక్రాన్ వేరియంట్ నేపథ్యంలో 11 దేశాలను భారత ప్రభుత్వం ఎట్-రిస్క్ జాబితాలో చేర్చింది

భారత ఎట్-రిస్క్ దేశాల జాబితాలో యూకే సహా 11 దేశాలు

న్యూఢిల్లీ: ప్రమాదకర ఒమైక్రాన్ వేరియంట్ నేపథ్యంలో 11 దేశాలను భారత ప్రభుత్వం ఎట్-రిస్క్ జాబితాలో చేర్చింది. వీటిలో యూకే, యూరోపియన్ యూనియన్ దేశాలతోపాటు దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్‌వానా, చైనా, హాంకాంగ్, ఇజ్రాయెల్, మారిషస్, న్యూజిలాండ్, సింగపూర్, జింబ్వాబ్వే ఉన్నాయి. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.


లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించిన మంత్రి.. ఎట్-రిస్క్ దేశాల నుంచి వచ్చే వారు ఆంక్షల్లో ఉంటారని తెలిపారు. ఇందులో15 రోజుల తప్పనిసరి క్వారంటైన్, తప్పనిసరి పరీక్షలు వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వారు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఎనిమిదో రోజు పరీక్ష చేయించుకున్న తర్వాత మరో ఏడు రోజులు పర్యవేక్షణలో ఉండాలని వివరించారు.  

Updated Date - 2021-12-03T01:52:47+05:30 IST