అమెరికా కొత్త ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వులపై స్పందించిన భారత్!

ABN , First Publish Date - 2020-07-10T05:03:33+05:30 IST

ట్రంప్ సర్కార్ అమెరికాలోని విదేశీ విద్యార్థులపట్ల తీసుకున్న అనూహ్య నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. కొత్త ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వులపై భా

అమెరికా కొత్త ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వులపై స్పందించిన భారత్!

న్యూఢిల్లీ: ట్రంప్ సర్కార్ అమెరికాలోని విదేశీ విద్యార్థులపట్ల తీసుకున్న అనూహ్య నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. కొత్త ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వులపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇప్పటికే హెచ్1బీ సహా ఉపాధి ఆధారిత వీసాల జారీపై నిషేధం విధించిన ట్రంప్ సర్కార్.. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యర్థులకు షాక్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు విద్యాసంస్థలు సిద్ధమైతే.. విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని అమెరికా ప్రకటించింది. అంతేకాకుండా కొత్తగా విద్యార్థి వీసాలను జారీ చేయబోమని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ప్రభావితం అవుతారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించి.. ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ సంబంధాల అభివృద్ధిల్లో విద్యా మార్పిడి పోషించిన పాత్రను దృష్టిలో పెట్టుకోవాలని’ అమెరికాకు సూచించినట్లు భారత విదేశాంగమంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. 


Updated Date - 2020-07-10T05:03:33+05:30 IST