విదేశాల నుంచి భారీగా అందుతున్న సాయం

ABN , First Publish Date - 2021-05-17T09:41:38+05:30 IST

దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో పలు విధాలుగా సహా యం చేయడానికి అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 27 నుంచి మే 15 వరకు విదేశాల నుంచి అందిన సాయం వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా..

విదేశాల నుంచి భారీగా అందుతున్న సాయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో పలు విధాలుగా సహా యం చేయడానికి అనేక దేశాలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 27 నుంచి మే 15 వరకు విదేశాల నుంచి అందిన సాయం వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా.. 11,058 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, 13,496 ఆక్సిజన్‌ సిలిండర్లు, 19 ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు, 5.3లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ భారత్‌కు వచ్చాయని, వీటిని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేశామని పేర్కొంది. మే 14-15 దేశాల్లో అత్యధిక సంఖ్యలో వైద్య పరికరాలు, ఉత్పత్తులు దేశానికి అందాయని తెలిపింది. జపాన్‌, స్విట్జర్లాండ్‌, కజకిస్తాన్‌, ఓం టారియో (కెనడా), అమెరికా, ఈజిప్ట్‌, యూకేల నుంచి సాయం అందినట్టు వెల్లడించింది. మరోవైపు చైనా భారీ సంఖ్యలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను భారత్‌కు పంపి తన దాతృత్వాన్ని చాటుకొంది.


3,600 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు చైనా నుంచి ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకొన్నాయి. ఆక్సిజన్‌ ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాలు రోమ్‌ (ఫ్రాన్స్‌) నుంచి ఆదివారం బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చాయి. ఎయిరిండియా ప్రత్యేక విమానాల్లో 34,200 కేజీల ముడిపదార్థాలు వచ్చాయి. మధ్య కొరియా నుంచి మరిన్ని ముడిపదార్థాలు రానున్నాయి. 

Updated Date - 2021-05-17T09:41:38+05:30 IST