భారత్‌లో వ్యాపారం చేయడం సవాలే: అమెరికా విదేశాంగ శాఖ

ABN , First Publish Date - 2021-07-22T22:49:09+05:30 IST

భారత్‌లో వ్యాపారాలు చేయడం ఇప్పటికీ సవాలేనని అమెరికా విదేశాంగ శాఖ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. వ్యాపార నిర్ణయాలకు కార్యనిర్వహక వ్యవస్థ సృష్టించే అడ్డంకులు(రెడ్ టేప్), అధిక పన్నులు, ప్రొక్రూర్‌మెంట్‌కు పరిమితులు వంటి రక్షణాత్మక వైఖరుల కారణంగా పోటీని తట్టుకునేలా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వ్యాపారులకు తగ్గిందని పేర్కొంది.

భారత్‌లో వ్యాపారం చేయడం సవాలే: అమెరికా విదేశాంగ శాఖ

వాషింగ్టన్: భారత్‌లో వ్యాపారాలు చేయడం ఇప్పటికీ సవాలేనని అమెరికా విదేశాంగ శాఖ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. వ్యాపార నిర్ణయాలకు కార్యనిర్వహక వ్యవస్థ సృష్టించే అడ్డంకులు(రెడ్ టేప్), అధిక పన్నులు, ప్రొక్రూర్‌మెంట్‌కు పరిమితులు వంటి రక్షణాత్మక వైఖరుల కారణంగా పోటీని తట్టుకునేలా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వ్యాపారులకు తగ్గిందని పేర్కొంది. అలాగే.. భారత్‌లో అమల్లో ఉన్న నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు మధ్య వ్యత్యాసముందని చెప్పింది. ఫలితంగా.. ఉత్పత్తిదారులు ప్రపంచవాణిజ్యానికి దూరంగా ఉంటున్నారని,  ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల వృద్ధికి ఇది అవరోధంగా మారిందని పేర్కొంది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్(విదేశాంగ శాఖ) బుధవారం నాడు ఓ నివేదిక విడుదల చేసింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు ఉన్న అనుకూలప్రతికూలతపై ఈ నివేదికలో విస్తృతంగా చర్చించింది. 

Updated Date - 2021-07-22T22:49:09+05:30 IST