ఐదు రోజుల త‌రువాత 4 ల‌క్ష‌లకు దిగువ‌గా క‌రోనా కేసులు న‌మోదు!

ABN , First Publish Date - 2021-05-10T13:56:14+05:30 IST

దేశంలోని గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి...

ఐదు రోజుల త‌రువాత 4 ల‌క్ష‌లకు దిగువ‌గా క‌రోనా కేసులు న‌మోదు!

న్యూఢిల్లీ: దేశంలోని గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 3.53 లక్షల మంది కోలుకున్నారు. ఇదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా త‌గ్గింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,66,317 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా, ఇదే స‌మ‌యంలో క‌రోనా మృతుల సంఖ్య కొద్దిగా క్షీణించి 3,747 వద్ద ఆగిపోయింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,26,62,410కు చేరింది. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపిన వివ‌రాల ప్రకారం గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనాతో 3,747 మంది మృతి చెంద‌గా, మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 2,46,146 కు చేరింది. దేశంలో క‌రోనాకు చికిత్స పొందుతున్న వారిసంఖ్య 37,41,368కు చేరింది. దేశంలో మరణాల రేటు 1.09 శాతంగా ఉండ‌గా, గత 24 గంటల్లో క‌రోనా కార‌ణంగా మహారాష్ట్రలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో నమోదైన 3,66,317 కేసుల్లో 71.75 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీతో సహా 10 రాష్ట్రాలకు చెందినవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated Date - 2021-05-10T13:56:14+05:30 IST