అత్యాధునిక పరికరాలను పంపాలంటూ.. అమెరికాను కోరిన భారత్

ABN , First Publish Date - 2020-04-10T02:02:39+05:30 IST

కరోనా మహమ్మారిని త్వరగా కనుగొనేందుకు అత్యాధునిక పరీక్ష పరికరాలను పంపాల్సిందిగా భారత ప్రభుత్వం అమెరికాను కోరింది. భారత విదేశాంగశాఖ

అత్యాధునిక పరికరాలను పంపాలంటూ.. అమెరికాను కోరిన భారత్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని త్వరగా కనుగొనేందుకు అత్యాధునిక పరీక్ష పరికరాలను పంపాల్సిందిగా భారత ప్రభుత్వం అమెరికాను కోరింది. భారత విదేశాంగశాఖ కార్యదర్శి హర్ష వర్దన్ యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ స్టీఫెన్ బీగన్‌తో ఫోన్‌లో సంభాషించారు. సంభాషణలో భాగంగా హర్ష వర్దన్ అమెరికా సాయాన్ని కోరారు. అమెరికాలో కరోనా విళయతాండవం ఆడుతున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కరోనాను త్వరగా కనుగొనేందుకు అమెరికా ప్రభుత్వం అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తోంది. ఈ కారణంగా తాను నిత్యం కరోనా పరీక్షలు చేయించుకుంటున్నట్టు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తెలిపారు. మరోపక్క హైడ్రాక్సీక్లోరిక్విన్‌ను అమెరికా పంపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల మోదీని కోరిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వం కూడా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఏ దేశాలకు అవసరముందో ఆ దేశాలకు ఎగుమతి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కాగా.. భారత్‌లో ఇప్పటివరకు 6,237 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా కారణంగా ఇప్పటివరకు 186 మంది మృతిచెందారు.

Updated Date - 2020-04-10T02:02:39+05:30 IST