టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ ప్లేస్‌కు కోహ్లీ సేన

ABN , First Publish Date - 2021-12-07T01:25:50+05:30 IST

న్యూజిలాండ్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన చివరిదైన రెండో టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని

టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ ప్లేస్‌కు కోహ్లీ సేన

ముంబై: న్యూజిలాండ్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన చివరిదైన రెండో టెస్టులో విజయం సాధించిన టీమిండియా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. కాన్పూరులో జరిగిన తొలి టెస్టులో చేతికి అందిన విజయాన్ని దూరం చేసుకున్న భారత్.. నేడు ముగిసిన రెండో టెస్టులో 372 పరుగుల భారీ తేడాతో ఓడించి రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడి ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోల్పోయిన భారత్ ఈ విజయంతో తిరిగి టాప్ ప్లేస్‌కు ఎగబాకింది. 


ప్రస్తుతం 124 పాయింట్లతో ఈ జాబితాలో కోహ్లీ సేన అగ్రస్థానంలో ఉండగా, 121 పాయింట్లతో న్యూజిలాండ్, 108 పాయింట్లతో ఆస్ట్రేలియా వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత వరుసగా ఇంగ్లండ్ (108), పాకిస్థాన్ (92), సౌతాఫ్రికా (88), శ్రీలంక (83), వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (49), జింబాబ్వే (31) ఉన్నాయి. ఇక, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) టేబుల్‌లో ఇండియా 42 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన శ్రీలంక అగ్రస్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది.

Updated Date - 2021-12-07T01:25:50+05:30 IST