డ్రాగన్‌ దూకుడు

ABN , First Publish Date - 2020-05-27T07:36:07+05:30 IST

చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ త్సో, గాల్వాన్‌ లోయ, డెమ్‌చోక్‌, దౌలత్‌బెగ్‌ ఓల్దీ ప్రాంతాలకు సమీపంలో చైనా సైన్యం పెద్ద ఎత్తున తిష్ట

డ్రాగన్‌ దూకుడు

  • లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో బలగాల మోహరింపు
  • యుద్ధ సన్నద్ధ చర్యలు ముమ్మరం చేయండి
  • చైనా సైన్యానికి ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశం
  • డోభాల్‌, రావత్‌, త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ
  • సీడీఎస్‌తో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమావేశం 
  • నేటి నుంచి అగ్ర శ్రేణి కమాండర్ల సమీక్ష


చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ త్సో, గాల్వాన్‌ లోయ, డెమ్‌చోక్‌ ప్రాంతాలకు సమీపంలో చైనా సైన్యం పెద్ద ఎత్తున తిష్ఠ వేసినట్లు తెలిసింది. చైనాను ఎదుర్కొనేందు కు భారత్‌ చర్యలు తీసుకుంటోంది. 


న్యూఢిల్లీ, మే 26: చైనా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ త్సో, గాల్వాన్‌ లోయ, డెమ్‌చోక్‌, దౌలత్‌బెగ్‌ ఓల్దీ ప్రాంతాలకు సమీపంలో చైనా సైన్యం పెద్ద ఎత్తున తిష్ట వేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన భారత్‌ చైనాను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఆయా ప్రాంతాలకు సైన్యాన్ని తరలించినట్లు సమాచారం. దాదాపు 20 రోజుల నుంచి తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలిసింది. చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే భారత్‌ గస్తీ పెంచింది. సరిహద్దుల్లోని సున్నిత ప్రాంతాల కు ఇరు దేశాలు తమ బలగాలను పంపుతున్నాయి. 2017 డోక్లాం ప్రతిష్ఠంభన అనంతరం మళ్లీ ఇప్పుడు లద్దాక్‌ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశా ల మధ్య తిరిగి అటువంటి పరిస్థితులే చోటుచేసుకునే అవకాశం ఉంది.


అలాగే, ఇరు దేశాల సరిహద్దు వివాదాలపై చర్చల ద్వారా పరిష్కార మార్గం కోసం ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. లద్దాఖ్‌కి సమీపంలో చైనా తమ ఎయిర్‌ బేస్‌ను మరింత విస్తరించడానికి ప్రయత్నా లు చేస్తుందని శాటిలైట్‌ చిత్రాల ద్వారా తె లిసింది. అక్కడ చైనా యుద్ధ విమానాలనూ మోహరించిందని స మాచారం. దీంతో భారత్‌ దీటుగా స్పందిస్తోంది. ఇటువంటి సమయంలో చైనా భద్రత, ప్రయోజనాలు, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవడానికి యుద్ధ సన్నద్ధత చర్యలను వేగవంతం చేయాలంటూ తమ సైన్యా న్ని మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ఆదేశించి ఆందోళన పెంచారు. చైనాకు దీటుగా భారత్‌ సరిహద్దు ప్రాంతాల్లో పలు నిర్మాణాలు చేపట్టింది. 


చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, త్రిదళాధిపతి (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌తో పాటు భారత సైన్య, నౌకాదళ, వాయుసేన అధిపతులతో ప్రధాని మోదీ మంగళవారం సమావేశమై చర్చించారు. అంతకుముందు బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమావేశమై చర్చలు జరిపారు. అగ్రశ్రేణి ఆర్మీ కమాండర్లు లద్దాఖ్‌లోని పరిస్థితులపై బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమగ్రంగా సమీక్ష జరపనున్నారు. కాగా, లద్దాఖ్‌లో ఏం జరుగుతోందన్న విషయంపై దేశ ప్రజలకు భారత ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వివరాలు తెలపాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-05-27T07:36:07+05:30 IST