పాక్ రాయబారికి సమన్లు జారీ చేసిన విదేశాంగశాఖ

ABN , First Publish Date - 2020-09-22T09:10:54+05:30 IST

పాకిస్థాన్‌లో సిక్కు యువతి కిడ్నాప్‌కు గురైన అంశంలో పాకిస్థాన్ హై కమిషన్‌కు చెందిన సీనియర్ అధికారికి భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. గురుద్వారా పంజా

పాక్ రాయబారికి సమన్లు జారీ చేసిన విదేశాంగశాఖ

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో సిక్కు యువతి కిడ్నాప్‌కు గురైన అంశంలో పాకిస్థాన్ హై కమిషన్‌కు చెందిన సీనియర్ అధికారికి భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. గురుద్వారా పంజా సాహిబ్ హెడ్ అయిన గ్రాంతీ అనే వ్యక్తి కూతురు పాకిస్థాన్‌లో అదృశ్యమైంది. దీంతో సోమవారం న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌ హై కమిషన్ ఎదుట సిక్కు కమ్యూనిటీ ధర్నాకు దిగింది. పాకిస్థాన్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ఇదే విధంగా జరుగుతోందని.. సిక్కులు హింసకు గురవుతున్నారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ చీఫ్ సిర్సా తెలిపారు. పాకిస్థాన్‌లో సిక్కు యువతులను కిడ్నాప్‌ చేసి బలవంతంగా వారి చేత మతమార్పిడి చేయిస్తున్నారని అన్నారు. దేశం మొత్తం ఈ విషయంలో పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా.. పాకిస్థాన్‌లో సిక్కు యువతులు కిడ్నాప్‌‌కు గురయ్యారంటూ ఇప్పటివరకు కొన్ని వందల వార్తలు వచ్చాయి. మరోపక్క పాకిస్థాన్‌లోని సిక్కు గురుద్వారాలను సైతం స్థానికులు, ల్యాండ్ మాఫియాలు కబ్జా చేసేస్తున్నాయి. 

Updated Date - 2020-09-22T09:10:54+05:30 IST