భారత్‌లో 2/3 మంది పని వయసు వారే

ABN , First Publish Date - 2020-07-05T07:54:02+05:30 IST

భారత్‌లో పనివయసులో ఉన్నవారి సంఖ్య పెరిగినట్లు సాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ 2018లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం దేశంలో రెండింట...

భారత్‌లో 2/3 మంది పని వయసు వారే

15-59 మధ్య వయస్కులపై సర్వే

71.1 శాతంతో తెలంగాణ ముందంజ

70.9 శాతంతో రెండో స్థానంలో ఏపీ


చెన్నై, జూలై 4: భారత్‌లో పనివయసులో ఉన్నవారి సంఖ్య పెరిగినట్లు సాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ 2018లో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం దేశంలో రెండింట మూడొంతుల మంది పనిచేసే వయసు(15-59 సంవత్సరాలు) వారు ఉన్నట్లు తేలింది. ఈ సర్వే ప్రకారం.. 2013 నుంచి ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 12 ప్రధాన రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో ఈ లెక్క తేలింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 70% మందికిపైగా పనిచేసే వయసు వారు ఉన్నారు. ఈ జాబితాలో తమిళనాడు (68.6%) నాలుగో స్థానంలో.. 59.7% మందితో బిహార్‌ చివరిస్థానంలో ఉంది. దేశంలో పనిచేసే వయసు వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. ఉపాధి లేకపోవడం, నైపుణ్యత కొరవడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపింది.

Updated Date - 2020-07-05T07:54:02+05:30 IST