ఫైటర్ జెట్స్‌తో భారత వాయుసేన మరింత పటిష్టం: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-01-14T02:29:17+05:30 IST

ఫైటర్ జెట్స్‌తో భారత వాయుసేన మరింత పటిష్టం: కేంద్ర మంత్రి

ఫైటర్ జెట్స్‌తో భారత వాయుసేన మరింత పటిష్టం: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ (సీసీఎస్) 73 తేజస్ ఎల్‌సీఎ (లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ఫైటర్ జెట్‌లు, 10 ట్రైనర్ విమానాలను సుమారు రూ. 45.7 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేయడానికి బుధవారం ఆమోదం తెలిపింది. ఫైటర్ జెట్‌ల విమానాలు దేశ రక్షణ రంగం సమృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.


రాబోయే కాలంలో ఎల్‌సీఏ జేజస్ జెట్ విమానాలు భారత వాయుసేనను పటిష్టం చేయనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. తేజస్ జెట్ విమానాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని మంత్రి ట్వీట్ చేశారు. తేజస్ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీ తయారు చేస్తోంది.


Updated Date - 2021-01-14T02:29:17+05:30 IST