Abn logo
Dec 4 2020 @ 03:43AM

రెజ్లింగ్‌ వరల్డ్‌కప్‌నకు భారత బృందం

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రెజ్లింగ్‌ వరల్డ్‌కప్‌లో 24 మంది భారత రెజ్లర్లు పోటీపడనున్నారు. ఇందులో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. సెర్బియాలో ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత భారత రెజ్లర్లు పోటీపడుతున్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే. రవి కుమార్‌ (57 కిలోలు), దీపక్‌ పూనియా (86), సత్యవర్త్‌ కడియన్‌ (97), సాక్షి మాలిక్‌ (65), నిర్మలాదేవి (50) తదితర రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు. ఫ్రీస్టయిల్‌, గ్రీకో-రోమన్‌ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement