14 దేశాలు మినహా వచ్చే నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు: కేంద్రం

ABN , First Publish Date - 2021-11-26T23:04:37+05:30 IST

14 దేశాలు మినహా వచ్చే నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు: కేంద్రం

14 దేశాలు మినహా వచ్చే నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు: కేంద్రం

న్యూఢిల్లీ: డిసెంబర్ 15 నుంచి 14 దేశాల మినహా భారత్ నుంచి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, బోట్స్వానాతోపాటు 14 దేశాల నుంచి అంతర్జాతీయ విమానాల సర్వీసును ఆపివేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. డిసెంబర్ 15 నుంచి రోజువారీ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్రం పేర్కొంది.


ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని దేశాల అంతర్జాతీయ విమానాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, హాంగ్ కాంగ్ దేశాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు ఉన్న నేపథ్యంలో ఆ దేశాల్లో విమానాలను ఆపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-11-26T23:04:37+05:30 IST