టీ20 సిరీస్‌ స్థానంలో వన్డేలు!

ABN , First Publish Date - 2020-05-31T09:06:40+05:30 IST

భారత్‌తో జరగబోయే మూడు టీ20ల సిరీ్‌సపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. వీటి స్థానంలో మూడు వన్డేలను

టీ20 సిరీస్‌ స్థానంలో వన్డేలు!

ఆసీస్‌లో భారత్‌ టూర్‌పై సీఏ ఆలోచన

న్యూఢిల్లీ: భారత్‌తో జరగబోయే మూడు టీ20ల సిరీ్‌సపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) పునరాలోచనలో పడ్డట్టు సమాచారం. వీటి స్థానంలో మూడు వన్డేలను ఆడించాలని భావిస్తోంది. ఆసీస్‌ వేదికగా అక్టోబరులో ఆరంభమయ్యే ఈ టూర్‌లో ఇరుజట్ల మధ్య 3 టీ20లు, 4 టెస్టులతో పాటు వచ్చే ఏడాది జనవరిలో 3 వన్డేలు జరగాలి. కానీ టీ20 సిరీస్‌ తర్వాత షెడ్యూల్‌ ప్రకారం అక్టోబరు 18 నుంచి పొట్టి ప్రపంచక్‌పలో ఆడాక భారత్‌ తిరిగి స్వదేశానికి రావాలి. ఆ తర్వాత మరోసారి ఆసీ్‌స వెళ్లి టెస్టు, వన్డే సిరీస్‌లో పాల్గొనాలి. దీంతో మూడు నెలల వ్యవధిలో కోహ్లీ సేన రెండుసార్లు ఆసీ్‌సకు వెళ్లాల్సి రావడం ప్రధాన అడ్డంకిగా మారనుంది. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌ను రద్దు చేసి ముందే వన్డే సిరీ్‌సను ఆడిస్తే సరిపోతుందని సీఏ భావిస్తోంది. 

Updated Date - 2020-05-31T09:06:40+05:30 IST