ఓవల్: ఆసీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత బౌలర్లు పట్టు బిగిస్తున్నారు. ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 158 పరుగుల దగ్గర కామెరాన్(21) పెవిలియన్ చేరాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో జడేజా చేతికి చిక్కాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 31 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు. క్రీజులో అలెక్స్, మ్యాక్స్ వెల్ ఉన్నారు. విజయానికి ఆసీస్ 142 పరుగుల దూరంలో ఉంది.