కాన్ బెర్రా: 303 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 22 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ ధాటిగా ఆడుతున్నాడు. 75 బంతుల్లో 72 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఫించ్‌కు జోడీగా మోయిసెస్ ఆడుతున్నాడు.
అంతకుముందు భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే నటరాజన్ షాకిచ్చాడు. జట్టు స్కోర్ 25 పరుగుల దగ్గర ఓపెనర్ మార్నస్ అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత వికెట్‌గా స్మిత్ వెనుదిరిగాడు. 12వ ఓవర్లో జట్టు స్కోర్ 7 పరుగుల దగ్గర ఠాకూర్ బౌలింగ్‌లో స్మిత్ ఔట్ అయ్యాడు.