వార్మప్ మ్యాచ్‌ మనదే.. ఇంగ్లండ్ చిత్తు

ABN , First Publish Date - 2021-10-19T05:00:56+05:30 IST

ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఓపెనర్లు..

వార్మప్ మ్యాచ్‌ మనదే.. ఇంగ్లండ్ చిత్తు

దుబాయ్: ఇంగ్లండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(51: 24 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్(70 రిటైర్డ్ నాటౌట్: 46 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థసెంచరీలతో అదరగొట్టారు. దీంతో 189 పరుగుల టార్గెట్‌ను మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. దీంతో వార్మప్ మ్యాచ్ టీమిండియా సొంతమైంది. మొదట బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్‌‌కు ఓపెనింగ్ గొప్పగా లభించలేదు. జేసన్ రాయ్(17), జాస్ బట్లర్(18) వెంటవెంటనే అవుటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన డేవిడ్ మలాన్ కూడా 18 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.


అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు అదిరిపోయే ఓపెనింగ్ లభించగా.. మిడిలార్డర్‌లో రిషబ్ పంత్(29 నాటౌట్: 14 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. అతడికి హార్దిక్ పాండ్యా(16 నాటౌట్: 10 బంతుల్లో 4 ఫోర్లు) తోడవడంతో 19 ఓవర్లలోనే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, లియామ్ లివింగ్‌స్టోన్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.


 అయితే మిడిలార్డర్‌లో జానీ బెయిర్‌స్టో(49: 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్స్) లియామ్ లివింగ్‌స్టోన్(30: 4 ఫోర్లు, 1 సిక్స్) స్కోరు బోర్డును నిలబెట్టారు. చివర్లో మోయీన్ అలీ(43 నాటౌట్: 20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగుల ఇచ్చినప్పటికీ.. మహ్మద్ షమి 3 వికెట్లు, జస్ప్రిత్ బుమ్రా, రాహుల్ చాహర్‌లకు చెరో వికెట్ దక్కాయి.

Updated Date - 2021-10-19T05:00:56+05:30 IST