Abn logo
Aug 2 2021 @ 01:40AM

అశ్వగంధపై భారత్‌- బ్రిటన్‌ ట్రయల్స్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కొవిడ్‌కు ఔషధాల అన్వేషణలో నిమగ్నమైన శాస్త్ర ప్రపంచం దృష్టి ఇప్పుడు ‘ఆయుర్వేదంలో రారాజు’గా పేరొందిన అశ్వగంధ మొక్కపై పడింది. ఇన్ఫెక్షన్‌ నుంచి కోలుకునేందుకు ఇది ఎంతమేరకు దోహదపడగలదనే అంశంపై ప్రయోగాలకు భారత్‌-బ్రిటన్‌ జట్టు కట్టాయి. భారత ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆల్‌ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద(ఏఐఐఏ), బ్రిటన్‌ ప్రభుత్వానికి చెందిన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌(ఎల్‌ఎ్‌సహెచ్‌టీఎం) మధ్య ఒప్పందం కుదిరింది.