కువైట్‌లో ప్ర‌వాసుల‌కు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన భార‌త రాయ‌బారి...

ABN , First Publish Date - 2020-06-04T19:13:47+05:30 IST

భార‌తీయ ప్ర‌వాసుల‌కు సాయం చేసేందుకు ఏర్పాటైన ఇండియ‌న్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్‌(ఐసీఎస్‌జీ) ఆధ్వ‌ర్యంలో కువైట్‌లోని జ్లీబ్ షుయూక్‌లో జ‌రిగిన ఆహార పంపిణీ కార్య‌క్ర‌మంలో భార‌త రాయ‌బారి జీవ సాగ‌ర్ పాల్గొన్నారు.

కువైట్‌లో ప్ర‌వాసుల‌కు ఆహార పొట్లాలు పంపిణీ చేసిన భార‌త రాయ‌బారి...

కువైట్ సిటీ: భార‌తీయ ప్ర‌వాసుల‌కు సాయం చేసేందుకు ఏర్పాటైన ఇండియ‌న్ కమ్యూనిటీ సపోర్ట్ గ్రూప్‌(ఐసీఎస్‌జీ) ఆధ్వ‌ర్యంలో కువైట్‌లోని జ్లీబ్ షుయూక్‌లో జ‌రిగిన ఆహార పంపిణీ కార్య‌క్ర‌మంలో భార‌త రాయ‌బారి జీవ సాగ‌ర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఐసోలేష‌న్ ప్రాంతాల్లో ఉన్న ప్ర‌వాస భార‌తీయుల‌కు ఆహార పొట్లాల‌ను అంద‌జేశారు. జీవ సాగ‌ర్ మాట్లాడుతూ ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఐసీఎస్‌జీ ఎంతో నియ‌బ‌ద్ధ‌తో కువైట్‌లోని భార‌త స‌మాజానికి స‌హాయం చేస్తోంద‌ని అన్నారు. అలాగే క‌రోనా సంక్షోభం వేళ‌ ఎన్నారైల సంర‌క్ష‌ణ కోసం కువైట్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న కొనియాడారు. క‌రోనా నేప‌థ్యంలో క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న భార‌త స‌మాజానికి క‌నీస సాయం అందించేందుకు భార‌త రాయ‌బార కార్యాల‌యం 14 మంది స‌భ్యుల‌తో కూడిన  ఐసీఎస్‌జీ బృందాన్ని ఏర్పాటు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా జీవ సాగ‌ర్ గుర్తు చేశారు. ఐసీఎస్‌జీ గ‌త నెల రోజులుగా 6వేల ఆహార పొట్లాల‌ను అందించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  

Updated Date - 2020-06-04T19:13:47+05:30 IST