భారత్‌కు బాసటగా సేవా ఇంటర్నేషనల్.. విరాళలో రూపంలో రూ.51కోట్ల సేకరణ

ABN , First Publish Date - 2021-05-07T21:31:56+05:30 IST

ఇండియా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలు భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. వాటితో పాటు పలు స్వచ్ఛంధ సంస్థల కూడా అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని ఇండియన్

భారత్‌కు బాసటగా సేవా ఇంటర్నేషనల్.. విరాళలో రూపంలో రూ.51కోట్ల సేకరణ

హ్యూస్టన్: ఇండియా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న వేళ ప్రపంచ దేశాలు భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. వాటితో పాటు పలు స్వచ్ఛంధ సంస్థల కూడా అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలోని ఇండియన్ అమెరికన్ స్వచ్ఛంధ సంస్థ సేవా ఇంటర్నేషనల్ ఇండియాకు ఆపన్న హస్తం అందిస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా విరాళాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేవలం 10 రోజుల్లోనే 7మిలియన్ డాలర్లు సమకూరినట్టు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైతున్న వేళ 5లక్షల డాలర్లను సమకూర్చడమే లక్ష్యంగా ఏప్రిల్ 25న విరాళల సేకరణను ప్రారంభించినట్టు తెలిపింది. 



అయితే అనతి కాలంలోనే అనూహ్య స్పందన లభించినట్టు పేర్కొంది. ఏకంగా 101,000 దాతలు ముందుకొచ్చి విరాళాలు సమర్పించినట్టు చెప్పింది. దీంతో ఇప్పటి వరకు 7 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 51.43కోట్లు) సమకూరినట్టు వెల్లడించింది. వేలాది మంది అమెరికన్లు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారని సేవా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు అరుణ్ కంకణి తెలిపారు. దీంతో మరింత ఉత్సహాంతో తాము ముందుకు వెళ్లేందుకు ప్రేరణ పొందుతున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. సేవా ఇంటర్నేషనల్ ఈ వారంలో 1,466 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకు తరలించింది. సేవా ఇంటర్నేషనల్ భాగస్వామ్య సంస్థ అయిన సేవా యునైటెడ్ కింగ్‌డమ్ మరో 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను భారత్‌కు పంపింది. కాగా.. ఢిల్లీలోని సేవా వలంటీర్లు వీటిని రిసీవ్ చేసుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. 


Updated Date - 2021-05-07T21:31:56+05:30 IST