Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూ.180కోట్ల భారీ మోసానికి పాల్పడిన భారతీయ అమెరికన్!

వాషింగ్టన్: కరోనాతో ఆర్థికంగా దెబ్బతిన్న అమెరికన్లను ఆదుకునేందుకు యూఎస్ సర్కార్ అమలు చేస్తున్న కొవిడ్ రిలీఫ్ స్కీంలో భారీ మోసానికి పాల్పడిన భారతీయ అమెరికన్‌ను తాజాగా అక్కడి న్యాయ విభాగం దోషిగా తేల్చింది. టెక్సాస్​లో ఉండే ఓ భారతీయుడు కొవిడ్​ ఉపశమన పథకంలో 24.8 మిలియన్ డాలర్లు(రూ.180 కోట్లు) మోసానికి పాల్పడినట్లు అమెరికా​ న్యాయ విభాగం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లో నివాసముండే దినేష్ షా(55) అనే భారత సంతతి వ్యక్తి 15 బోగస్​ పత్రాలను ఉపయోగించి వివిధ బ్యాంకుల నుంచి 'పే చెక్​ ప్రొటెక్షన్​ ప్రోగ్రాం'(పీపీపీ) ద్వారా మోసపూరితంగా సుమారు రూ.180 కోట్లు పొందాడు. తనకు పలురకాల వ్యాపారాలున్నాయని చెప్పి వివిధ వ్యక్తుల పేరు మీద దినేష్ ఇలా భారీ మొత్తాన్ని పొందినట్లు న్యాయ విభాగం గుర్తించింది. అనంతరం ఈ డబ్బుతో అతను విలాసవంతమైన కార్లు, ఇళ్లను కొనుగోలు చేయడంతో పాటు జల్సాలకు ఉపయోగించనట్లు జస్టిస్ డిపార్ట్​మెంట్​ క్రిమినల్​ విభాగం తాత్కాలి అటార్నీ జనరల్​ నికోలస్ ఎల్ మెక్‌క్వైడ్​ పేర్కొన్నారు. తాజాగా దినేష్‌ను యూఎస్​ న్యాయ విభాగం ముందు హాజరుపరచగా తన నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించింది. దీంతో న్యాయ విభాగం అతడ్ని దోషిగా తేల్చింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది.  


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement