Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత సంతతి పోలీసు అధికారిపై కాల్పులు.. పరిస్థితి విషమం..!

ఇంటర్నెట్ డెస్క్: ఓ ఇంట్లో గొడవ జరుగుతోందన్న సమాచారంతో విషయం తెలుసుకునేందుకు వెళ్లిన ఓ భారత సంతతికి చెందిన అమెరికా పోలీసు అధికారిపై నిందితుడు కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. జార్జియా రాష్ట్రంలో గత వారం ఈ దారుణం జరిగింది. కాల్పుల్లో గాయపడ్డ పోలీసు అధికారి పరమహంస దేశాయ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుడి వివరాలు తెలిపిన వారికి భారీ నజరానా ప్రకటిస్తామని అక్కడి పోలీసు డిపార్ట్‌మెంట్ ప్రముఖ ఎన్‌బీఏ క్రీడాకారుడు షకీల్ ఓ నీల్ ప్రకటించారు. హెన్రీ కౌంటీ పోలీసు డిపార్ట్‌మెంట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టు  సమాచారం అందడంతో పరమహంస్ అక్కడికి వెళ్లినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జోర్డాన్ జాక్సన్ అనే యువకుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తుండగా అతడు పరమహంసపై కాల్పులు జరిపి పారిపోయినట్టు తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement