ప్రమీలా జయపాల్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్

ABN , First Publish Date - 2021-03-04T22:23:55+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన పాలనావిభాగంలో ఇప్పటికే పలువురు భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

ప్రమీలా జయపాల్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తన పాలనావిభాగంలో ఇప్పటికే పలువురు భారతీయ అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా భారత సంతతి కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ను మరో ఉన్నత పదవికి ఎంపిక చేశారు. యాంటీట్రస్ట్‌, కమర్షియల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ లా సబ్‌కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రమీలాను నియమించారు బైడెన్‌. తనను ఈ ఉన్నత పదవికి నియమించడం పట్ల ప్రమీలా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడికి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కాగా, 2020 డిసెంబరులో యూఎస్ పార్లమెంటు కాంగ్రెస్ ప్రోగ్రెసివ్ కాకస్ (సీపీసీ) అధ్యక్షురాలిగా ప్రమీలా ఎన్నికైన విషయం తెలిసిందే. హేట్ ఫ్రీ జోన్‌ను స్థాపించి అమెరికాలో ఆసియా సంతతి ప్రజలకు విశేష సేవలందించారామె. అలాగే ఇమ్మిగ్రేషన్ నియమాలను మరింత పారదర్శకంగా, సరళం చేయడంలోనూ తనవంతు కృషి చేశారు ప్రమీలా. 


Updated Date - 2021-03-04T22:23:55+05:30 IST