అగ్రరాజ్యంలో భార‌తీయ అమెరికన్లపై నిత్యం వివక్షే..!

ABN , First Publish Date - 2021-06-10T20:11:00+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఇండో- అమెరికన్లు నిత్యం వివ‌క్ష‌కు గుర‌వుతున్న‌ట్లు బుధ‌వారం విడుద‌లైన ఓ స‌ర్వే వెల్ల‌డించింది. యూఎస్‌లో వలసదారుల్లో రెండో అతిపెద్ద స‌మూహంగా ఉన్న భార‌తీయ అమెరిక‌న్ల‌పై వివక్ష స‌ర్వ‌సాధార‌ణమ‌ని ఈ నివేదిక పేర్కొంది. 2018 గ‌ణాంకాల‌ ప్ర‌కారం అగ్ర‌రాజ్యం జ‌నాభాలో 1శాతానికి పైగా అంటే సుమారు 46 ల‌క్ష‌ల మంది భార‌త...

అగ్రరాజ్యంలో భార‌తీయ అమెరికన్లపై నిత్యం వివక్షే..!

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో ఇండో- అమెరికన్లు నిత్యం వివ‌క్ష‌కు గుర‌వుతున్న‌ట్లు బుధ‌వారం విడుద‌లైన ఓ స‌ర్వే వెల్ల‌డించింది. యూఎస్‌లో వలసదారుల్లో రెండో అతిపెద్ద స‌మూహంగా ఉన్న భార‌తీయ అమెరిక‌న్ల‌పై వివక్ష స‌ర్వ‌సాధార‌ణమ‌ని ఈ స‌ర్వే నివేదిక పేర్కొంది. 2018 గ‌ణాంకాల‌ ప్ర‌కారం అగ్ర‌రాజ్యం జ‌నాభాలో 1శాతానికి పైగా అంటే సుమారు 46 ల‌క్ష‌ల మంది భార‌తీయులు ఉంటున్న‌ట్లు స‌మాచారం. ఇక అమెరికాలో పుట్టి, ఆ దేశ పౌర‌స‌త్వం పొందిన చాలా మంది వారి శ‌రీర వ‌ర్ణం ఆధారంగా వివ‌క్ష‌కు గుర‌వుతున్న‌ట్లు తెలిపింది. ద‌శాబ్దాల పాటు అక్క‌డే నివాసం ఉంటున్న‌, చివ‌రికి ఆ దేశ పౌర‌స‌త్వం ఉన్న‌ప్ప‌టికీ వేధింపులు, వివ‌క్ష‌త‌ కొనసాగుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ఆన్‌లైన్ వేదిక‌గా ‘సోషల్‌ రియాలిటీస్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్స్‌: ఇండియ‌న్ అమెరిక‌న్ ఆటిట్యూడ్స్’ పేరిట నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో 1,200 మంది భారతీయ అమెరిక‌న్లు పాల్గొన్నారు. ఈ స‌ర్వేను 2020 సెప్టెంబ‌ర్ 1-20 మ‌ధ్య  కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్, జాన్స్‌ హాప్కిన్స్‌–ఎస్‌ఏఐఎస్, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా సంయుక్తంగా నిర్వహించాయి. బుధ‌వారం స‌ర్వే నివేదిక‌ను వెల్ల‌డించాయి. స‌ర్వేలో వెల్ల‌డైన విష‌యాల‌ను ప‌రిశీలిస్తే..


అగ్ర‌రాజ్యంలో ఇండో-అమెక‌రిన్ల‌పై వివ‌క్ష నిత్యం స‌ర్వ‌సాధార‌ణం. అలాగే యూఎస్‌లో తాము వివక్షకు గురవుతున్నామ‌ని ప్రతి ఇద్దరిలో ఒకరు అన్నారు. ముఖ్యంగా తమ శ‌రీర వ‌ర్ణానికి సంబంధించి వివ‌క్ష‌త‌ను ఎదుర్కొంటున్న‌ట్లు తెలిపారు. అమెరికా గ‌డ్డపై పుట్టిన భారత సంతతి వారు కూడా అధికంగా అవ‌హేళ‌న‌కు గురవుతున్న తేలింది. అలాగే ఇండో-అమెరిక‌న్లు త‌మ సొంత సామాజిక వ‌ర్గాల్లోని వారినే జీవిత భాగ‌స్వాములుగా చేసుకోవ‌డానికి సుముఖ‌త చూపుతున్నారు. ఈ స‌ర్వేల్లో పాల్గొన్న ప్ర‌తి 10 మందిలో 8 మంది జీవిత భాగ‌స్వాములు స్వ‌దేశీ సంత‌తికి చెందిన‌వారే. భారతీయ తల్లి-అమెరికా తండ్రి, భారతీయ తండ్రి-అమెరికా తల్లికి పుట్టిన వారు కూడా తెల్ల‌జాతి అమెరిక‌న్ల‌ నుంచి వివక్షను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఇక భారతీయ అమెరికన్ల జీవితాల్లో మతం కీల‌క‌ పాత్ర వ‌హిస్తోంది. నిత్యం ఒక్కసారైనా ప్రార్థన చేస్తామని 40 శాతం మంది చెబితే, వారంలో ఒక్కసారైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటామని 27 శాతం మంది చెప్పారు. అంతేగాక భార‌తీయ అమెరిక‌న్ అని చెప్పుకోవ‌డానికి కూడా చాలా మంది గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్లు తెలిసింది.  

Updated Date - 2021-06-10T20:11:00+05:30 IST