తగ్గిన ఇండియన్‌ బ్యాంక్‌ లాభం

ABN , First Publish Date - 2020-08-15T06:27:22+05:30 IST

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 25 శాతం తగ్గి రూ.369 కోట్లుగా నమోదైంది. మొండి పద్దుల కోసం భారీగా కేటాయింపులు చేపట్టడంతో లాభం తగ్గిందని తెలిపింది...

తగ్గిన ఇండియన్‌ బ్యాంక్‌ లాభం

ముంబై: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 25 శాతం తగ్గి రూ.369 కోట్లుగా నమోదైంది. మొండి పద్దుల కోసం భారీగా కేటాయింపులు చేపట్టడంతో లాభం తగ్గిందని తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.492 కోట్లుగా ఉం ది. సమీక్షా కాలంలో  ఆదాయం రూ. 11,446.71 కోట్లుగా ఉంది. వ్యాపార వృద్ధి, నికర వడ్డీ ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటే పనితీరు సంతృప్తికరంగా ఉందని బ్యాంక్‌ ఎండీ, సీఈఓ పద్మజ చుండూరు తెలిపారు. 

Updated Date - 2020-08-15T06:27:22+05:30 IST