Advertisement
Advertisement
Abn logo
Advertisement

బుర్జ్ ఖలీఫాపై గోల్డ్ ప్లేటెడ్ కాఫీతో సందడి చేసిన నటి సనా ఖాన్

యూఏఈ: బాలీవుడ్ నటి సనా ఖాన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా వద్ద భర్త అనీస్ సయ్యద్‌లో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా సనా బుర్జ్ ఖలీఫాపై గోల్డ్ ప్లేటెడ్ కాఫీ తాగారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. వీటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. కేవలం 18 గంటల వ్యవధిలోనే ఏకంగా 3.68 లక్షల లైక్స్ వచ్చి పడ్డాయి. 'నా భర్త అనీఫ్ ఇవాళ బుర్జ్ ఖలీఫాపై బ్రేక్‌ఫాస్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. గోల్డ్ ప్లేటెడ్ కాఫీ కూడా తాగాను.' అంటూ సనా ఇస్టాలో రాసుకొచ్చారు. కాగా, 2020 నవంబర్‌లో భారతీయ వ్యాపారవేత్త, ఇస్లామిక్ స్కాలర్ అయిన అనీస్ సయ్యద్‌‌ను సనా పెళ్లి చేసుకున్నారు. Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement