Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఐదేళ్లలో 4 వేల మందికి భారత పౌరసత్వం

న్యూఢిల్లీ, నవంబరు 30: గత ఐదేళ్లలో 10,645మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా.. 4,177మందికి మంజూరైందని లోక్‌సభకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. 2016-2020 మధ్య వచ్చిన దరఖాస్తుల్లో అమెరికా నుంచి 227, అప్ఘనిస్థాన్‌-795, బంగ్లాదేశ్‌ నుంచి 184 ఉన్నాయన్నారు. పాకిస్థాన్‌ నుంచి అత్యధికంగా 7782 వచ్చాయన్నారు. 2016లో 1106మంది, 2017-817, 2018-628, 2019-987, 2020లో 639మంది భారత పౌరసత్వం పొందారని ఆయన వివరించారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement