క్రికెటర్ షమీ భార్య హసిన్ జహాన్ సింధూరంతో ప్రత్యక్షం

ABN , First Publish Date - 2021-03-02T15:27:35+05:30 IST

భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య, ప్రముఖ మోడల్ హసిన్ జహాన్ సింధూరంతో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

క్రికెటర్ షమీ భార్య హసిన్ జహాన్ సింధూరంతో ప్రత్యక్షం

సోషల్ మీడియాలో ఫొటో పోస్టు

కోల్‌కతా : భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య, ప్రముఖ మోడల్ హసిన్ జహాన్ తాజాగా సింధూరంతో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.హసిన్ జహాన్ చీర కట్టుకొని సింధూరం పెట్టుకొని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.‘‘సహనమనే వేలు పట్టుకొని ముందుకు వచ్చాను...నేను ప్రయాణించిన రహదారి ఆశ్చర్యానికి గురి చేసింది’’అని హసిన్ జహాన్ సింధూరం పెట్టుకున్న చిత్రంతోపాటు వ్యాఖ్యను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. షమీ, జహన్ ల మధ్య గత కొంతకాలంగా విబేధాలున్నా, ఈ జంట విడాకులు తీసుకోలేదు.


తాజాగా హసిన్ జహాన్ సింధూరం పెట్టుకున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. మహ్మద్ షమీ, జహాన్‌లకు ఐరా అనే కుమార్తె ఉంది.షమీ, హసిన్ జహాన్ లు 2014 ఏప్రిల్ నెలలో వివాహం చేసుకున్నారు. అనంతరం షమీపై జహాన్ పలు ఆరోపణలు చేశారు. ఇతర మహిళలతో షమీ సంబంధాలు పెట్టుకున్నాడని జహాన్ ఆరోపించారు.హసిన్ జహాన్ తన చిన్ననాడు సైఫుద్దీన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2012లో తన భర్త సైఫుద్దీన్ నుంచి విడిపోయిన జహాన్ షమీని రెండో పెళ్లి చేసుకుంది. 

Updated Date - 2021-03-02T15:27:35+05:30 IST